: తేలి కులస్తులంతా పేరుకు ముందు 'మోదీ'ని చేర్చుకోండి.. ప్రధాని సోదరుడి పిలుపు
నూనె ఉత్పత్తి చేసే తేలి సమాజ్ కులస్తులందరూ ఇక నుంచి విధిగా పేరుకు ముందు 'మోదీ' పదాన్ని చేర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ సూచించారు. ప్రధాని మోదీ యావత్ దేశంతోపాటు తేలి కులస్తులకు గర్వకారణంగా నిలిచారని, కాబట్టి తేలి కులస్తులందరూ పేరుకు ముందు 'మోదీ'ని చేర్చుకోవాలని పిలుపునిచ్చారు. అయితే వారు తమ పేరుకు ముందు మోదీని చేర్చుకునేందుకు ఇష్టపడడం లేదని పేర్కొనడం గమనార్హం. ఆదివారం భోపాల్‌లో జరిగిన సాహు కులస్తుల యువతీయువకుల అఖిల భారత సమావేశంలో ప్రహ్లాద్ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.