: వాళ్లకు 318 పరుగులు కావాలి... మనకు 8 వికెట్లు కావాలి


విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ఓపెనర్లు కుక్ 54, హమీద్ 25 పరుగులకు ఔట్ అయ్యారు. వీరిద్దరూ ఎల్బీడబ్ల్యూగానే వెనుదిరిగారు. హమీద్ ను అశ్విన్ ఔట్ చేయగా, కుక్ ను జడేజా పెవిలియన్ కు పంపించాడు. ఆటకు రేపు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. విజయం సాధించాలంటే ఇంగ్లండ్ మరో 318 పరుగులు చేయాలి. భారత్ గెలవాలంటే మరో 8 వికెట్లను పడగొట్టాలి. ఈ నేపథ్యంలో, రేపటి తొలి సెషన్ చాలా కీలకం కానుంది.

  • Loading...

More Telugu News