: చితికి పెట్టినట్లుగా అక్రమ ఆయుధాలకు నిప్పుపెట్టారు!


ఆఫ్రికా దేశం కెన్యాలో చితికి పెట్టినట్లుగా అక్రమ ఆయుధాలకు నిప్పుపెట్టారు. ఈ సంఘటన గత వారం నైరోబీలో జరిగింది. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకున్న 5,250 అక్రమ ఆయుధాలను మూడు వరుసలలో ఎత్తుగా పేర్చి వాటికి కెన్యా ఉపాధ్యక్షుడు విలియం రూటో నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్నికి ఆహుతైన తుపాకుల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చివేసినవి కొన్ని, ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నవి మరికొన్ని ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను విలియం రూటో తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News