: మాకు భారత్ ఎప్పుడూ కీలక భాగస్వామే: అమెరికా


అమెరికాకు భారత్ ఎప్పుడూ కీలక భాగస్వామే అని ఆ దేశ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. ఒబామా పాలనలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యాయని... రానున్న రోజుల్లో ఈ బంధాలు మరింత పెంపొందించుకుంటామని ఆయన చెప్పారు. అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సర్నాకు జాన్ కిర్బీ స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే క్రమంలో నవతేజ్ సర్నాకు అన్ని విధాలా సహాయ పడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News