: షారుఖ్ ఖాన్ కు తృటిలో తప్పిన ప్రమాదం
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'డియర్ జిందగీ' చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇందులో అలియా భట్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు గౌరీ షిండే దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమాలో షారుఖ్, అలియాలు గల్లీ రోడ్డులో సైకిల్ పై చక్కర్లు కొట్టే సన్నివేశాన్ని షూట్ చేయాల్సి ఉంది. దీనికి కావాల్సిన సామాగ్రిని ఓ టెంపోలో తీసుకొచ్చారు. టెంపో ఆగిన చోటే సైకిల్ పక్కన షారుఖ్ నిల్చున్నాడు. అయితే, షారుఖ్ ను గమనించని డ్రైవర్ టెంపోను స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. దీంతో, అది సైకిల్ మీదనుంచి వెళ్లిపోయింది. దీన్ని గమనించిన షారుఖ్ వెంటనే పక్కకు తప్పుకోవడంతో... అతనికి పెను ప్రమాదం తప్పింది. దీంతో, యూనిట్ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు.