: రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేసిన బీజేపీ
బీజేపీ అధిష్ఠానం పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేసింది. ఓటింగ్ కు అవకాశమిచ్చే నిబంధన కింద పెద్ద నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలంటూ లోక్ సభలోను, ప్రధాని మోదీ సమక్షంలో చర్చ జరగాలంటూ రాజ్యసభలోను విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో తమ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు జరగనున్న రాజ్యసభ శీతాకాల సమావేశాల్లో పాల్గొనాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గైర్హాజరు కాకూడదని పేర్కొంటూ విప్ జారీ చేసింది.