: రద్దయిన నోట్ల డిపాజిట్లపై ఎస్బీఐ కొత్త రూలు


దేశ వ్యాప్తంగా బ్యాంకుల్లో భారీ ఎత్తున జ‌రుగుతున్న డిపాజిట్ల నేప‌థ్యంలో అక్ర‌మార్కులు ఇత‌రుల ఖాతాల్లో త‌మ డ‌బ్బుని వేస్తున్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుండ‌డంతో ర‌ద్ద‌యిన‌ కరెన్సీ నోట్ల డిపాజిట్లపై ఎస్బీఐ కొత్త నిబంధ‌న తీసుకొచ్చింది. ఇత‌రుల ఖాతాల్లో డ‌బ్బు వేస్తున్న వారిని నియంత్రించేందుకు, వారిని క‌నిపెట్టేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో భాగంగా ఈ రోజు కొత్త డిక్ల‌రేష‌న్ ఫాంను రూపొందించినట్లు ప్ర‌క‌టించింది. డిక్ల‌రేష‌న్‌లో థ‌ర్డ్ పార్టీ పేరు రాయాల‌ని సూచించింది. బ్యాంకుల‌న్నీ ఈ మార్గద‌ర్శ‌కాలు పాటించాల‌ని పేర్కొంది.

  • Loading...

More Telugu News