: హెచ్సీయూలో మరో వివాదం...విద్యార్థి ఆత్మహత్యాయత్నం
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. దీంతో వివాదం రాజుకుంది. యూనివర్సిటీ విద్యార్థులు గచ్చిబౌలిలోని యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ఆందోళనకు దిగారు. మచిలీపట్నానికి చెందిన పరిశోధక విద్యార్థి అబ్రహాం తన గైడ్ ప్రొఫెసర్ వైజీశ్వరన్ సరైన గైడెన్స్ ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతుండడంతో విరక్తి చెంది, ఆత్మహత్యాయత్నానికి పాల్పాడ్డాడు. దీనిని గుర్తించిన సహచర విద్యార్థులు అతనిని కాపాడి, ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త యూనివర్సిటీ మొత్తం వ్యాపించడంతో విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ భవన్ ముందు ఆందోళనకు దిగారు. వేధింపుల గైడ్ వైజీశ్వరన్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అబ్రహాం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.