: అసోం ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్ల మృతి... కొనసాగుతున్న కాల్పులు
అసోంలోని పెంగ్రిలో ఈ రోజు ఉదయం నుంచి అనుమానిత ఉల్ఫా ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సంఖ్య మూడుకి పెరిగింది. ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ పేలడంతోనే జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, గాయాలపాలయిన మరికొందరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అసోం డీజీపీ ముఖేష్ సాహాయ్ మీడియాకు తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదుల సంఖ్యపై స్పష్టమైన సమాచారం లేదని చెప్పారు. ఉగ్రదాడిని జవాన్లు దీటుగా తిప్పికొడుతున్నారని అన్నారు.