: మావోల బీభత్సం... ప్రభుత్వ ఉద్యోగి మెడ నరికి, ఐదు వాహనాలకు నిప్పు


రెండు వారాల క్రితం తమకు జరిగిన అపార నష్టానికి ఏ విధంగానైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న మావోయిస్టులు, తమకు అందే ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదు. కొత్త రోడ్లు వేస్తుండగా, అవి పూర్తయితే, పోలీసుల రాకపోకలు సులువవుతాయని భావించిన మావోలు బీభత్సం సృష్టించారు. ఓ ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేశారు. ఈ ఘటన ఒడిశా లోని కోరాపుట్ జిల్లా, తిమిలిగూడ మండలం బిత్తర్ కోట వద్ద జరిగింది. రహదారి పనులను పర్యవేక్షిస్తున్న సూపర్ వైజర్ మెడను దారుణంగా నరికారు. ఆయన్ను పోలీసుల ఇన్ ఫార్మర్ గా ఆరోపిస్తూ, అక్కడికక్కడ ప్రజా కోర్టు నిర్వహించి, తీర్పిచ్చి, ఆపై నిర్దయగా గొంతు కోసి చంపారు. ఆపై రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఐదు వాహనాలకు నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న కూంబింగ్ దళాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.

  • Loading...

More Telugu News