: ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో హీరోయిన్ గా నటించలేకపోయాను: నాటి తరం నటి, నిర్మాత కృష్ణవేణి
ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో హీరోయిన్ గా నటించలేకపోయాననే బాధ తనకు ఉందని నాటి తరం నటి, నిర్మాత కృష్ణవేణి అన్నారు. ‘మనదేశం’ చిత్ర నిర్మాత అయిన కృష్ణవేణి, ఈ చిత్రం ద్వారా నటుడిగా నందమూరి తారకరామారావును, సంగీత దర్శకుడిగా ఘంటసాల వెంకటేశ్వరరావును చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్ ను, ఘంటసాలను చిత్ర పరిశ్రమకు నేను పరిచయం చేశానని అనుకోను. ఎందుకంటే, అది అంతా భగవంతుడి నిర్ణయం’ అని అన్నారు. కాగా, తెలుగులో జీవనజ్యోతి, దక్షయజ్ఞం, భీష్మ, మనదేశం, లక్ష్మమ్మ తదితర చిత్రాల్లో ఆమె నటించారు.