: రూ.2 వేల నోటు అసలో, నకిలీదో ఇలా తెలుసుకోవాలి!
కొత్తగా వచ్చిన రూ.2 వేల నోట్ లోని ప్రత్యేకతల గురించి ఇంతకుముందే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించి చెప్పింది. తాజాగా, ఆ నోట్ లోని ‘ఇంటాగ్లియో’ అనే ఒక సెక్యూరిటీ ఫీచర్ గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ ఫీచర్ లో భాగంగా కాగితంలోకి ఒక రకమైన డిజైన్ ను చొప్పిస్తారని తెలిపింది. రూ.2 వేల నోట్ అసలో, నకిలీయో ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని కూడా ప్రజలకు తెలిపింది. ఒక వస్త్రాన్ని తీసుకుని రెండు వేల నోట్ పై రుద్దితే టర్బో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ పుడుతుందని, తద్వారా ఆ నోట్ లోని ఇంక్ వస్త్రంలోకి బదిలీ కావడంతో చిన్నపాటి షాక్ లాంటిది తగులుతుందని పేర్కొంది. ఈ విధమైన షాక్ తగిలితే ఆ నోట్ ఒరిజినల్ అని, లేకపోతే నకిలీ అని వివరించింది.