: లెక్చరర్ తిట్టాడని.. ఇంట‌ర్ సెకండియ‌ర్‌ విద్యార్థిని ఆత్మహత్య


హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ నారాయణ జూనియర్ కాలేజీ ఇంట‌ర్ సెకండియ‌ర్ విద్యార్థిని శ్రీ‌వర్ష ఈ రోజు ఆత్మహత్య చేసుకుంది. మోతీనగర్‌లోని త‌మ ఇంట్లో ఉరివేసుకొని క‌నిపించిన ఆమెను గ‌మ‌నించిన కుటుంబ‌స‌భ్యులు ఆసుప‌త్రికి త‌ర‌లించగా, శ్రీ‌వ‌ర్ష అప్ప‌టికే మృతి చెందింద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. ఇటీవ‌ల కాలేజీలో నిర్వ‌హించిన పరీక్షలకు శ్రీ‌వ‌ర్ష గైర్హాజరు కావ‌డంతో ఆమెను బౌతిక శాస్త్ర అధ్యాప‌కుడు ప్రేమ్‌కుమార్ క్లాస్ లో అంద‌రి ముందు తిట్టాడని, ఆ కార‌ణంగానే తమ కుమార్తె ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింద‌ని శ్రీ‌వర్ష త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ యాజ‌మాన్యంపై మండిప‌డుతున్నారు. స‌మాచారం అందుకున్న‌ సనత్‌నగర్ పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రికి తరలించి, కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News