: క్షేమంగా మంగోలియాలో ల్యాండైన చైనా వ్యోమ‌గాములు


బిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేసి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఆధిపత్యం సాధించే దిశగా చైనా వేసిన అడుగులు విజయవంతమైనట్టు కనిపిస్తున్నాయి. అంత‌రిక్షంలో స్పేస్ స్టేష‌న్ నిర్మించాల‌న్న చైనా కోరిక తీరేందుకు చేసిన తొలి ప్రయత్నం నెరవేరింది. టియాన్‌ గాంగ్‌-2 స్పేస్ స్టేషన్ ను సెప్టెంబ‌ర్ 15న చైనా శాస్త్రవేత్తలు ప్ర‌యోగించారు. ఇందులో ఆస్ట్రోనాట్స్‌ జింగ్ హైపింగ్‌, చెన్ డాంగ్ లు వెళ్లారు. వీరిద్దరూ సుమారు 30 రోజులపాటు అంతరిక్షంలో గడిపారు. అనంతరం అక్టోబ‌ర్ 18న షెంజూ-11 అంత‌రిక్ష నౌకను చైనా అంతరిక్షంలోకి పంపింది. దీనిలో వెనుదిరిగిన వారిద్దరూ సురక్షితంగా మంగోలియాలో ల్యాండ్ అయ్యారు. కాగా, చైనా వ్యోమ‌గాములు ఎక్కువ కాలం అంత‌రిక్షంలో గ‌డ‌ప‌డం ఇదే మొద‌టిసారి.

  • Loading...

More Telugu News