: పెద్ద నోట్ల రద్దుపై ప్రధానితో భేటీకి రేపు హస్తిన వెళ్లనున్న కేసీఆర్
పెద్ద నోట్లను రద్దు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ లో చర్చించారు. ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణలో ఏర్పడ్డ సమస్యలపై ప్రధానితో చర్చించారు. ఆ సమస్యలను లిఖితపూర్వకంగా అందించాలని ప్రధాని మోదీ, కేసీఆర్ కు సూచించడంతో ఆయన రేపు ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ హస్తిన పర్యటన ఆసక్తి రేపుతోంది. పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణకు ఆదాయం తగ్గిపోయిందని కేసీఆర్ చెబుతున్న సంగతి తెలిసిందే.