: బ్యాంకులకు మేము ఎలాంటి బకాయిలు లేము.. అంతా చెల్లించేశాం!: అక్కినేని నాగార్జున


బ్యాంకులకు తాను కాని, అన్నపూర్ణ స్టూడియోస్ కాని ఎలాంటి బకాయిలు పడలేదని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పష్టం చేశారు. తాము బకాయిలు చెల్లించలేదంటూ కొంతమంది మాట్లాడుతున్నారని... వారందరికీ ఈ విషయాన్ని చెబుతున్నామని తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ అభివృద్ధి కోసం ఇంతకు ముందు బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న మాట వాస్తవమేనని... కానీ, ఈ ఏడాది ప్రారంభంలోనే వాటన్నిటినీ చెల్లించేశామని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తన వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News