: తగ్గిన ధరల తరువాత, తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవి!


అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రో ఉత్పత్తుల ధరలను సవరించిన తరువాత తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 72.25 నుంచి రూ. 70.37కు తగ్గింది. గుంటూరులో ధర రూ. 73.56 నుంచి రూ. 71.09కి తగ్గింది. ఇక డీజిల్ ధర హైదరాబాద్ లో రూ. 61.55 నుంచి రూ. 59.65కు తగ్గింది. విశాఖపట్నంలో డీజిల్ ధర రూ. 62.49 నుంచి రూ. 60.53కు తగ్గింది. కాగా, లీటర్ పెట్రోల్ ధరను రూ.1.46, డీజిల్ ధరను రూ.1.53 తగ్గిస్తూ, గత రాత్రి ఓఎంసీలు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News