: 40 మంది ఎంపీలతో ర్యాలీగా వెళ్లి రాష్ట్రపతిని కలుస్తా...మిగతా పార్టీలు కలిసి వస్తే మంచిది: మమతా బెనర్జీ

ఒక్క నిర్ణయంతో దేశ ప్రజలను బిచ్చగాళ్లను చేశారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, ప్రధాని నిర్ణయంతో దేశ ప్రజలు పనులన్నీ వాయిదా వేసుకుని, బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు క్యూకట్టారని విమర్శించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసిన ఆమె, ఇతర పార్టీలు కలిసి వచ్చినా, రాకున్నా తమ పార్టీకి చెందిన 40 మంది ఎంపీలతో కలిసి వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామని ప్రకటించారు. అయితే ఈ పోరాటంలో అన్ని పార్టీలు కలిసి వస్తే బాగుంటుందని ఆమె సూచించారు. ఈ నేపథ్యంలో శివసేన, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) ఆమెకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ పార్టీల నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొననున్నారు.

More Telugu News