: ‘గాలి’ కూతురు పెళ్లికి వెళ్లొద్దని నాకెవ్వరూ చెప్పలేదు: యడ్యూరప్ప


ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కూతురి వివాహానికి వెళ్లొద్దని తనకు ఎవ్వరూ చెప్పలేదని కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప స్పష్టం చేశారు. ఈ పెళ్లికి బీజేపీ నేతలు, నాయకులు ఎవరూ హాజరుకావద్దని ఆ పార్టీ అగ్ర నాయకత్వం చెప్పిందంటూ వచ్చిన వార్తలను యడ్యూరప్ప కొట్టిపారేశారు. కాగా, బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో రేపు ఈ పెళ్లి జరగనుంది. 600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా తన కూతురు వివాహాన్ని గాలి జనార్దన్ రెడ్డి చేయనున్నారు.

  • Loading...

More Telugu News