: పెద్దనోట్ల రద్దు నిర్ణయం బడాబాబులకు వత్తాసు పలికే చర్య: బీఎఫ్ఎఫ్ఐ కొత్త అధ్యక్షుడు
పెద్దనోట్ల రద్దు నిర్ణయం బడాబాబులకు వత్తాసు పలికే చర్యగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడు టి.నరేంద్రన్ అభివర్ణించారు. బీఎఫ్ఎఫ్ఐ 12వ రాష్ట్ర సదస్సు సందర్భంగా నరేంద్రన్ మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దు నిర్ణయం పేదల కష్టాలను మరింత పెంచిందని, ప్రస్తుతం దేశంలో ఏర్పడిన పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రజల అవసరాలను తీర్చలేని పరిస్థితికి బ్యాంకులు నెట్టబడ్డాయని, కరెన్సీని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు.