: గంభీర్ బ్యాక్ టు పెవిలియన్... కేఎల్ రాహుల్ ఇన్?


టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ అందివచ్చిన అవకాశాలు వినియోగించుకోలేకపోయాడు. దీంతో మళ్లీ పెవిలియన్ కు పరిమితం కానున్నాడు. తొలి టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మెరుగ్గా రాణించిన ఇంగ్లండ్ జట్టును దీటుగా ఎదుర్కోవాలంటే, జట్టులో మార్పులు చేయడం అనివార్యం అని భావించిన కోహ్లీ విఫలమవుతున్న గంభీర్ స్థానంలో కేఎల్ రాహుల్ ను తీసుకోనున్నాడు. ఇటీవల గాయంతో దూరమైన రాహుల్ ఫిట్ నెస్ నిరూపించుకోవడంతో అతనికి లైన్ క్లియర్ అవుతోంది. తద్వారా మురళీ విజయ్, కేఎల్ రాహుల్, కోహ్లీ, పుజారా, రహానే, అశ్విన్, సాహాలతో జట్టు బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా మారుతుందని, తద్వారా ఇంగ్లండ్ ను ఓడించవచ్చని కోహ్లీ భావిస్తున్నాడు. దీంతో విశాఖ టెస్టులో గంభీర్ స్థానంలో కేఎల్ రాహుల్ దిగనున్నాడు.

  • Loading...

More Telugu News