: పెద్ద నోట్ల రద్దు తరువాత మారిన కశ్మీర్... నిరసనకారులకు డబ్బివ్వట్లేదు, హింసలేదు!


ఈ వార్త ఆలోచించదగ్గ ఆసక్తికర అంశమే. గతవారంలో ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తరువాత కశ్మీర్ లోయలో ఒక్క రాళ్లు రువ్విన సంఘటన, ఒక్క హింసాత్మక సంఘటనా నమోదు కాలేదు. నోట్ల రద్దు తరువాత వేర్పాటు వాదుల నుంచి నిరసనకారులకు వచ్చే డబ్బు ఆగిందని, దీంతో ఏ యువకుడూ హింసకు దిగలేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సైతం చెబుతున్నారు. "ఇంతకుముందు భద్రతా దళాలపై రాళ్లు రువ్వితే రూ. 500, అంతకుమించి ఇంకేదైనా చేస్తే రూ. 1000 ఇచ్చేవాళ్లు. ఇప్పుడు మోదీ ఉగ్ర నిధుల విలువను జీరో చేశారు" అన్నారు పారికర్. ఆర్థిక భద్రత కోసం తీసుకున్న సాహసోపేత నిర్ణయాలతో కాశ్మీర్ లో పరిస్థితి చక్కబడిందని అన్నారు. కాగా, వేర్పాటు వాదుల వద్ద కొత్త కరెన్సీ లేకపోడవంతో వారి నుంచి నిరసనకారులకు ఏ విధమైన ధన సహాయం అందడం లేదు. దీంతో నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు యువత నిరాసక్తంగా ఉన్నారని తెలుస్తోంది. పాత నోట్లు ఇస్తామని వేర్పాటు వాదులు చెబుతున్నా, అవి వద్దని నిరసనకారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇక దీన్ని అనుకూలంగా మలచుకుని లోయలో తిరిగి సాధారణ జీవనాన్ని ప్రజలు కొనసాగించేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

  • Loading...

More Telugu News