: తన ఎత్తు, బరువు చూసుకున్న గవర్నర్ నరసింహన్


తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, బాలల దినోత్సవం సందర్భంగా తన బరువు, ఎత్తునకు తగ్గట్టుగా ఆరోగ్యంగా ఉన్నానా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించుకున్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా జాతీయ పౌష్టికాహార సంస్థ రాజ్ భవన్ లో ఓ స్టాల్ ను ఏర్పాటు చేయగా, అక్కడకు వెళ్లిన నరసింహన్ తన ఎత్తు, బరువును చూసుకున్నారు. గవర్నర్ ఎత్తు 5.9 అడుగులు కాగా, బరువు 76.6 కిలోలు. ఆయన వయసు, బరువుకు తగ్గట్టుగానే బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) ఉందని నిపుణులు తేల్చారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఆరోగ్యానికి మేలు కలిగించే ఆహారాన్ని తీసుకోవడంతోనే తాను ఇంతకాలం సంపూర్ణ ఆరోగ్యంతో జీవించానని అన్నారు. విద్యార్థులు మంచి ఆహారాన్ని తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News