: వారం పాటు విమానాశ్రయాల్లో పార్కింగ్ ఫ్రీ
500, 1000 రూపాయల నోట్ల రద్దు, 2000 రూపాయల విడుదల సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులపాలు చేసిన సంగతి తెలిసిందే. నల్లధనాన్ని అంతం చేసేందుకు తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంగీకరించి, సహకరించాలని ప్రధాని ప్రజలకు సూచించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజల చిల్లర ఇక్కట్లను గుర్తించిన కేంద్రం ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా టోల్ టాక్స్ రద్దును మరికొన్ని రోజులపాటు పొడిగించింది. బ్యాంక్ ల నుంచి తీసుకునే మొత్తం పరిమితిని పెంచింది. తాజాగా విమానాశ్రయాల వద్ద పార్కింగ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు అంటే వచ్చే సోమవారం (నవంబర్ 21) వరకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎలాంటి పార్కింగ్ వసూలు చేయరని ప్రకటించింది.