: ఏపీలో పతంజలి మెగా ఫుడ్ పార్క్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రానుంది. ఏపీలో మెగా ఫుడ్ పార్కు ఏర్పాటు చేసేందుకు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ గ్రూపు సీఈవో ఆచార్య బాలకృష్ణ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. ఈ సందర్భంగా పతంజలి సంస్థ ఫుడ్ పార్కు, గోవుల సంతతి పరిరక్షణ కేంద్రం, ఆయుర్వేద వర్సిటీలను కూడా ఏపీలో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ మేరకు విశాఖ, విజయనగరంలో పతంజలి గ్రూపు స్థల పరిశీలన కూడా పూర్తిచేసిందని ఆయన చెప్పారు.