: కేజ్రీవాల్ ను చిన్నపిల్లాడ్ని చేసేసిన రాంగోపాల్ వర్మ!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చిన్నపిల్లాడిని చేశాడు. మామూలుగా చాలామందిపై విమర్శలు గుప్పించే రాంగోపాల్ వర్మ, కేజ్రీవాల్ ను ఎద్దేవా చేయడం టాక్ ఆఫ్ ది ట్విట్టర్ అయింది. సమాజంలోని వివిధ అంశాలపై తనదైన శైలిలో స్పందించే వర్మ, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని, 'చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు.. కేజ్రీవాల్' అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ, కేజ్రీవాల్ దేశంలో అతిపెద్ద కంప్లయింట్ బాక్స్ అని, అందుకే వర్మ శుభాకాంక్షలు చెప్పాడని పేర్కొనగా, మరో నెటిజన్ 'వర్మ రాహుల్ గాంధీని మర్చిపోయాడా? లేక కావాలనే విస్మరించాడా?' అని ప్రశ్నించాడు. కాగా, 500, 1000 నోట్ల రద్దు అనంతరం కేజ్రీవాల్ ప్రధాని నిర్ణయం లోపభూయిష్టమంటూ మండిపడుతున్న సంగతి తెలిసిందే.