: హైదరాబాదులో ఉబెర్ క్యాబ్ డ్రైవర్ల ఆందోళన


హైదరాబాదులో ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. క్యాబ్స్ ను అడ్డగోలుగా పెంచి, తమకు రావాల్సిన కమిషన్ ను తగ్గిస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాదులోని హైటెక్స్ వద్ద ఉబెర్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. సర్వీసులను పెంచడంతో, తమ ఆదాయం తగ్గిపోతుందని, డ్రైవర్ల జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం పెంచిన సర్వీసులను ఉపసంహరించుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు ధర్నాకు దిగారు. దీంతో ఉబెర్ క్యాబ్స్ సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News