: ఐదు రోజుల్లో బ్యాంకులకు చేరిన డిపాజిట్లు రూ. 1.5 లక్షల కోట్లు, విత్ డ్రా రూ. 7,705 కోట్లు
పెద్ద నోట్లను రద్దు చేసి, వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పిన తరువాత ఇప్పటివరకూ రూ. 1.5 లక్షల కోట్లు బ్యాంకుల్లోకి వచ్చి చేరాయి. ఇదే సమయంలో రూ. 7,705 కోట్లను ప్రజలు విత్ డ్రా చేసుకున్నారు. రూ. 100, రూ. 2000 నోట్లతో పాటు రూ. 50, రూ. 20 నోట్లను విత్ డ్రాలో భాగంగా కస్టమర్లకు అందించినట్టు ఆర్బీఐ అధికారి ఒకరు తెలిపారు. పీఓఎస్ మెషీన్లలో సైతం కార్డు లావాదేవీల్లో భాగంగా విత్ డ్రా లు సాగుతున్నాయని వివరించారు. డిపాజిట్ అయిన మొత్తంలో సగానికి పైగా అంటే, రూ. 75,945 కోట్లు వచ్చి చేరాయి. ఇదే సమయంలో రూ. 3,753 కోట్లు విత్ డ్రా అయ్యాయి. కాగా, నేడు గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, బీహార్, హర్యానా రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో అన్ని రకాల లావాదేవీలూ జరగనున్నాయి.