: ఉమర్ అక్మల్ ఆంగ్ల భాషా ప్రావీణ్యం 'అద్భుతం'... క్రికెటర్ మృతికి 'వెరీ నైస్' అంటూ సంతాపం!
ఆంగ్ల భాషా ప్రావీణ్యం విషయంలో పాకిస్థాన్ క్రికెటర్ల సత్తా ఎలా ఉంటుందన్న విషయమై గతంలో ఎన్నో ఉదాహరణలు వచ్చాయి. ఇంజమామ్ ఉల్ హక్, యూనిస్ ఖాన్, షోయబ్ అఖ్తర్ వంటి వారెందరో వచ్చీరాని ఇంగ్లీషుతో నవ్వుల పాలై విమర్శలు తెచ్చుకున్నారు. తాజాగా ఉమర్ అక్మల్ సైతం ఈ జాబితాలో చేరాడు. పాక్ మాజీ కోచ్ డేవ్ వాట్ మోర్, తన ట్విట్టర్ ఖాతాలో, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టాంగిల్స్ మృతిచెందిన విషయాన్ని తెలుపగా, అక్మల్ స్పందిస్తూ, 'వెరీ నైస్' అని ట్వీట్ చేసి ఓ స్మైలీని పెట్టాడు. దీంతో విస్మయానికి గురైన ఎంతో మంది ఉమర్ తెలివిపై జోకులు పేల్చారు. మరో ఆటగాడు షెజాద్ హెచ్చరికలతో తెలివి తెచ్చుకున్న ఉమర్, పొరపాటు జరిగిందని, మన్నించాలని మరో ట్వీట్ పెట్టాడు.