: నా మంత్రివర్గంలో నవరత్నాలు ఉన్నాయి.. ఎంతో గర్విస్తున్నా: ప్రధాని మోదీ
గోవాలోని శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈరోజు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ తన మంత్రివర్గంలో నవరత్నాలు ఉన్నాయని, అందుకు తాను ఎంతో గర్విస్తున్నానని పేర్కొన్నారు. వారిలో ఒకరు గోవాకి చెందిన కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అని మోదీ పేర్కొన్నారు. పారికర్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారని, సుమారు 40 ఏళ్లుగా ఆలస్యం అవుతున్న ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపించారని మోదీ కొనియాడారు. వన్ ర్యాంక్ వన్ పింఛన్ విధానంలో పారికర్ ఎంతో నేర్పును చూపారని ఆయన అన్నారు. పారికర్ చూసిన పరిష్కార మార్గాలతో తాము ఇప్పుడు వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లగలుతున్నామని చెప్పారు.