: తన సోదరి వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించిన సానియా మీర్జా
భారత టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసింది. ఈ సందర్భంగా తన సోదరి వివాహానికి కేసీఆర్ను సానియా ఆహ్వానించింది. ఇటీవల సానియా మీర్జా ఆడిన టోర్నీల వివరాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. టెన్నిస్లో మరింత రాణించి తెలంగాణకు పేరు తీసుకురావాలని ఆయన కోరారు. మహిళల టెన్సిస్ డబుల్స్ విభాగంలో ఇటీవలే సానియా మీర్జా రెండోసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.