: మలయాళ చిత్ర పరిశ్రమకు షాక్... నటి రేఖా మోహన్ ఆత్మహత్య!
ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటి రేఖా మోహన్, తన అపార్టుమెంట్ లో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. ఫ్లాట్ లోపల తాళం వేసుకుని ఉండటంతో ఆమెది ఆత్మహత్యగా భావిస్తున్నారు. త్రిసూర్ లో నివసిస్తున్న ఆమె, గత రెండు రోజులుగా తన భర్తకు అందుబాటులోకి రాలేదు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో, అనుమానం వచ్చిన ఆయన, పోలీసుల సాయం కోరాడు. పోలీసులు ఆమె నివాసానికి వెళ్లి, తలుపులు బద్దలు కొట్టి చూడగా, ఆమె మృతదేహం కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేఖా మోహన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనతో మలయాళ చిత్ర పరిశ్రమకు దిగ్భ్రాంతికి లోనైంది. కాగా, మూడు రోజుల క్రితం తమిళ నటి సబర్ణ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే.