: ‘డీపీ-బులియన్స్’లో లెక్క చూపని కిలోల కొద్దీ బంగారం.. స్వాధీనం చేసుకున్న అధికారులు
హైదరాబాద్ లోని పలు జ్యువెలరీ షాపులపై ఐటీ దాడులు రెండో రోజూ కొనసాగాయి. ఐటీ శాఖ అధికారులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. 50 టీమ్ లను రంగంలోకి దించారు. డీపీ-బులియన్స్ జ్యువెలరీస్ లో లెక్కచూపని కిలోల కొద్దీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా, ఏపీలోని విజయవాడ, విశాఖపట్టణం, నెల్లూరులోని జ్యువెలరీ షాపులపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. కాగా, రూ.500, రూ.1000 నోట్లు రద్దుతో నల్లధనవంతులు బంగారం కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో సంబంధిత అధికారులు నిన్న రంగంలోకి దిగారు. రద్దు ప్రకటన వెలువడిన నాటి నుంచి ఆయా షాపుల్లో బంగారం విక్రయాలు జరిపిన వారి వివరాలను అధికారులు సేకరించారు.