: బ్రిడ్జి మరమ్మతుల కారణంగా యూపీ నుంచి వెళ్లే పలు రైళ్లు నెలరోజుల పాటు రద్దు


ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్లే 24కు పైగా రైళ్లను సుమారు ఒక నెల రోజుల పాటు రద్దు చేశారు. యూపీలోని ఉన్నావో నుంచి కాన్పూర్ ను కలిపే రైల్వే బ్రిడ్జికి మరమ్మతులు నిర్వహిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు. లక్నో-న్యూఢిల్లీ గోమ్నీ ఎక్స్ ప్రెస్ ను ఈరోజు నుంచి 27 రోజుల పాటు, గోరఖ్ పూర్- యశ్వంత్ పూర్, చెన్నై- లక్నో ఎక్స్ ప్రెస్ లు, ఆగ్రా ఇంటర్ సిటీ సహా పలు ముఖ్యమైన రైళ్లు వచ్చే నెల మొదటి వారం వరకు నడవవని, కొన్ని రైళ్లను దారి మళ్లించామని పేర్కొన్నారు. కాన్పూర్-లక్నో రైలు సెక్షన్ మధ్య నడిచే రైళ్లపై కూడా బ్రిడ్జి మరమ్మతుల ప్రభావం ఉంటుందని అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News