: 500, 1000 ఎఫెక్ట్... మార్నింగ్ షోకి ఒకే ఒక్కడు!


500, 1000 రూపాయల నోట్ల ఆకస్మిక రద్దు నిర్ణయం సినీ పరిశ్రమపై భారీగానే పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కొన్ని సినిమాలను శుక్రవారం రోజే విడుదల చేశారు. అయితే ప్రేక్షకుల వద్ద పెద్ద నోట్ల సమస్య తలెత్తడంతో సినిమాలు చూసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో మహారాష్ట్ర, గుజరాత్ లోని కొన్న పట్టణాల్లో సినిమాలు చూసేందుకు ఎవరూ ధియేటర్లకు వెళ్లలేదు. అహ్మదాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్ లో సినిమా చూసేందుకు కేవలం ఒక్కడంటే ఒక్కడు మాత్రమే వెళ్లాడు. అయితే బాధ్యత ప్రకారం షోను రద్దు చేయకుండా అతని కోసం థియేటర్ యాజమాన్యం సినిమాను ప్రదర్శించింది. విద్యుత్ ఖర్చుకు సరిపడా డబ్బులు రాకపోయినా తమ బాధ్యత ప్రకారం సినిమాను వేశామని థియేటర్ యాజమాన్యం తెలిపింది. అతని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News