: వైట్ హౌస్ లో తొలిసారి అడుగుపెట్టిన డొనాల్డ్ ట్రంప్... ఒబామాతో భేటీ


అమెరికా కొత్త అధ్యక్షుడిగా విజయం సాధించిన అనంతరం తొలిసారి డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో అడుగుపెట్టారు. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఆయన సమావేశమయ్యారు. ఒబామా ఆహ్వానం మేరకు వైట్ హౌస్ కు వచ్చిన ట్రంప్ కు ఆయన సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీరి భేటీపై అమెరికా మొత్తం ఆసక్తి వ్యక్తం చేసింది. ఎన్నికలకు ముందు, విజయం సాధించిన తరువాత కూడా ఒబామా మాట్లాడుతూ, ట్రంప్ అధ్యక్షుడు కావడాన్ని జీర్ణించుకోలేనని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అధ్యక్షుడిగా హుందాగా వ్యవహరిస్తానని ట్రంప్ కూడా ప్రకటించారు. ఈ భేటీ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News