: సల్మాన్ ఖాన్ కు ఇక పెళ్లి కానట్టే!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలు ఎన్ని కోట్లు కొల్లగొడతాయో అంచనా వేయొచ్చేమో కానీ... అతను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లతో అఫైర్లు నడిపిన సల్లూభాయ్... కొంత కాలం తర్వాత వారందరితో విడిపోయాడు. తాజాగా రొమేనియాకి చెందిన మోడల్ యులియా వంతూర్ తో సల్మాన్ ప్రేమాయణం సాగించాడు. వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. దీంతో, సల్మాన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని ఆయన అభిమానులు సంతోషపడ్డారు. కానీ, ఇది కూడా మూడు రోజుల ముచ్చటే అయిందని సమాచారం. వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదని... విడిపోయారని బాలీవుడ్ లో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. యులియాకి ఇంతకు ముందే వివాహమైనట్టు... ఆమె భర్తతో కలసిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. అంతేకాదు, తన మాజీ భర్తతో యులియా ఇంకా టచ్ లోనే ఉందని... అది సల్మాన్ కు నచ్చలేదని... అందుకే రిలేషన్ ను బ్రేక్ చేశాడని చెబుతున్నారు. సల్మాన్ కు మంచి భార్యగా ఉండేందుకు యులియా ప్రయత్నించినప్పటికీ వర్కవుట్ కాలేదని అంటున్నారు.