: భగ్గుమన్న రాజకీయ కక్షలు... గ్రామపెద్ద కుటుంబం ప్రాణాలు తీసిన దుండగులు


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. చ‌వాడ గ్రామంలో ఓ గ్రామ‌పెద్ద కుటుంబంపై తుపాకుల‌తో దాడి చేసిన 13 మంది దుండ‌గులు ఆ కుటుంబం మొత్తాన్ని దారుణంగా హ‌త‌మార్చారు. గ్రామపెద్ద శకుంతల (50)తో పాటు ఆమె కుటుంబం రాత్రి పూట నిద్రిస్తోన్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దుండుల దాడిలో ఆమె భర్త విశ్వాంబర్ (55), కుమారులు సునిల్(30), సుశీల్‌(35)లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించి, మహేశ్, సురేష్, గోవిందాతో పాటు మ‌రో 10 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఈ కేసులో ఇంత‌వ‌ర‌కు ఎవ‌రినీ అరెస్టు చేయ‌లేద‌ని పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News