: ఈ రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
పెద్దనోట్ల రద్దు, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నిన్న భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 265 పాయింట్లు లాభపడి 27,517 వద్ద, నిఫ్టీ 94 పాయింట్లు లాభపడి 8,525 పాయింట్లు వద్ద ముగిశాయి. సిప్లా, టాటా స్టీల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హిందాల్కో, ఎస్ బీఐ సంస్థల షేర్లు లాభపడగా, ఇన్ఫోసిస్, హీరో మోటో కార్ప్, ఏషియన్ పెయింట్స్, లుపిన్ తదితర సంస్థల షేర్లు నష్టాలు చవిచూశాయి.