: పాలకులు ‘హోదా’పై మాట తప్పారు.. ఈ రోజు పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారు: జనసేన కార్యకర్తలు
జనసేన అధినేత, సినీనటుడు పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ అనంతపురంలో నిర్వహించతలపెట్టిన సీమాంధ్రహక్కుల చైతన్య సభ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. సభ నిర్వహించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆయన అభిమానులు, జనసేన పార్టీ మద్దతుదారులు భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై పాలకులు మాట తప్పారని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఈ రోజు కూడా హోదాపైనే ప్రశ్నిస్తారని చెప్పారు. తమ నాయకుడికి అనంతపురంలో ఘనస్వాగతం పలికినట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హోదా అంశంపై ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. పవన్ కల్యాణ్ ప్రజల తరఫున పోరాడతారని వ్యాఖ్యానించారు.