: అప్పుడే మొదలైన క్యూ.. బ్యాంకుల వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్న ప్రజలు


బ్యాంకులు తెరవడానికి మరో గంటన్నర ముందే ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నారు. తమ వద్ద ఉన్న వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లతో ఒక్కొక్కరుగా బ్యాంకులకు చేరుకుంటున్నారు. దీంతో అన్ని బ్యాంకుల వద్ద నెమ్మదిగా క్యూలు ఏర్పడుతున్నాయి. బ్యాంకులు తెరిచే సమయానికి క్యూలు కొండవీటి చాంతాడులా మారే అవకాశం ఉంది. దీంతో ఎటువంటి తోపులాటలు జరగకుండా బ్యాంకుల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. అయితే బ్యాంకులకు కొత్తనోట్లు పూర్తిస్థాయిలో చేరకపోవడంతో నగదు మార్పిడిని ఉదయం నుంచీ చేయలేమని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం తర్వాతే నోట్ల మార్పిడి చేస్తామని చెబుతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో నోట్ల మార్పిడి సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బ్యాంకుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News