: 'అధిక ఓట్లు మనవే అయినా ఓటమి ముందు నిలవడం తట్టుకోలేకున్నా' అంటూ మూగబోయిన హిల్లరీ గొంతు
"మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఎందుకంటే మీలా నేను కూడా బాధపడుతున్నాను కాబట్టి. తమ ఆశలను, కలలను పెట్టుబడిగా పెట్టిన కోట్లాది మంది అమెరికన్లు ఎంతో బాధపడుతున్నారు. ఈ ఎన్నికల్లో అత్యధికులు మనకే మద్దతుగా నిలిచారు. ప్రత్యర్థుల కంటే ఓట్లు ఎక్కువగా మనకే వచ్చాయి. కానీ సీట్లు మాత్రం రాలేదు. ఈ బాధ చాలా కాలం పాటు ఉంటుంది" అని గద్గద స్వరంతో హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. ఓడిపోయిన తరువాత తొలిసారి మాట్లాడిన ఆమె, తన ప్రసంగం మధ్యలో పలుమార్లు తడబడ్డారు. మూగబోయిన గొంతుతో మాట్లాడారు. దిస్ ఈజ్ పెయిన్ ఫుల్... అండ్ ఇట్ విల్ బీ లాంగ్ టైం... అన్నప్పుడు ఆమె కళ్లల్లో నీళ్లు కనిపించాయి. అమెరికన్లు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలని, మనం ప్రేమించే దేశం కోసం కలసి ముందుకు సాగాల్సి వుందని అన్నారు. డెమోక్రాట్ల ప్రచారం ఒక వ్యక్తికి వ్యతిరేకంగానో లేదా ఒక ఎన్నికల్లో విజయం కోసమో కాదని అన్నారు. దేశ భవిష్యత్ కోసమని చెప్పారు.