: మోదీ ప్రకటన తర్వాత పేటీఎం చెల్లింపులకు ఒక్కసారిగా పెరిగిన డిమాండ్
పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించాక పేటీఎం చెల్లింపులకు భారీ డిమాండ్ ఏర్పడినట్టు ఆ సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ సోనియా ధావన్ పేర్కొన్నారు. మోదీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన, రూ.1000, రూ. 500 నోట్లు రద్దయినప్పటి నుంచి పేటీఎం చెల్లింపులకు భారీ డిమాండ్ పెరిగిందన్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే అది 435 శాతానికి చేరుకున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దేశంలో ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియ భవిష్యత్తులో మరింత ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు తర్వాత తమ ఖాతాదారులెవరూ అసౌకర్యానికి గురికాలేదన్నారు. దేశంలో పేరుకుపోయిన నల్లధనం నిర్మూలనకు మోదీ నిర్ణయం బాగా ఉపకరిస్తుందన్నారు.