: అత్యాచారానికి గురైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు


ప్రతి రోజూ ఏదో ఒకచోట అత్యాచారం జరిగి దేశ ప్రతిష్ఠను దిగజారుస్తున్న తరుణంలో మహిళా కానిస్టేబుళ్లకు కూడా రక్షణ లేకపోవడం కలకలం రేపుతోంది. అన్యాయం జరిగితే మహిళా పోలీస్‌ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తారు. అలాంటిది ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు వేర్వేరు చోట్ల అత్యాచారానికి గురికావడం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌ లోని గ్వాలియర్‌ లో కానిస్టేబుల్‌ గా పని చేస్తున్న ఓ యువతిని నరేంద్ర అనే వ్యక్తి బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా ఆమెను ఎత్తుకెళ్లేందుకు నరేంద్రకు మరో వ్యక్తి సహకరించాడు. ఆమె ఫిర్యాదుతో గ్వాలియర్ పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. తమిళనాడులోని మధురలో ఓ మహిళా కానిస్టేబుల్‌ కు పానీయంలో మత్తుమందు కలిపి సత్యేంద్ర సింగ్ అనే పోలీస్ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తువీడిన అనంతరం ఆమె అత్యాచారానికి గురైనట్టు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సత్యేంద్ర సింగ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News