: పెద్దనోట్లపై వేటు వేయమని ముందే చెప్పిన ‘బిచ్చగాడు’...సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో హల్ చల్


ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనతో నిన్న అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్ల రద్దు అమలవుతోంది. మోదీ ప్రకటన అనంతరం, దేశ వ్యాప్తంగా ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. తాజా నిర్ణయంతో అవినీతిపరులు, నల్లకుబేరులు, నకిలీ కరెన్సీ రాకెట్లకు దిమ్మ తిరిగే షాక్ తగిలినట్లయింది. ఇదిలా ఉంటే, పెద్దనోట్ల రద్దు విషయం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఇటీవల తెలుగులో విడుదలైన తమిళ డబ్బింగ్ చిత్రం ‘బిచ్చగాడు’లోని డైలాగ్ లు ప్రస్తావనకు వస్తున్నాయి. ‘పేదరికాన్ని తగ్గించడానికి ఒక ఐడియా చెప్పండి?’ అని ఈ చిత్రంలో బిచ్చగాడి పాత్రలోని వ్యక్తిని మరో పాత్ర ప్రశ్నిస్తుంది. ఇందుకు సమాధానంగా ‘ఇండియాలో పేదరికాన్ని తగ్గించడానికి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడమే’ అని ఆ బిచ్చగాడి పాత్ర సమాధానమిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రంలోని ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. కాగా, 'ప్రతినిధి' సినిమాలో నారా రోహిత్ ఒక సన్నివేశంలో ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసి సంధించిన ప్రశ్నల్లో నల్లధనం నివారణకు సూచననిస్తూ పెద్దనోట్లను రద్దు చేయాలనే డైలాగ్ చెబుతాడు. ఇదే స్ఫూర్తిగా ‘బిచ్చగాడు’ సినిమాలో ఈ డైలాగ్ ను వాడారనే వార్తలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News