: ప్రపంచంలో మనమే టాప్... మరెవరిదైనా రెండో స్థానమే!: ట్రంప్


యావత్ ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికానే అని ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రపంచంలో టాప్ ప్లేస్ అమెరికాదేనని... మరెవరిదైనా రెండో స్థానం మాత్రమే అని చెప్పారు. నెంబర్ టూ అనే ఆలోచనే మనకు రాదని తెలిపారు. మనతో కలిసొచ్చే దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకుందామని అన్నారు. కొత్త అమెరికాను నిర్మించుకుందామని... దీనికోసం అందరం కలసి పనిచేద్దామని చెప్పారు. గెలుపు, ఓటములు సహజమని... వాటిని పక్కనపెట్టి దేశ అభివృద్ధి కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. గెలవడం ఎప్పటికీ చరిత్రే అని... అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిద్దామని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలకు సేవ చేసేందుకు ఇది తనకు లభించిన అవకాశమని చెప్పారు.

  • Loading...

More Telugu News