: జగన్ ను కలిసిన ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులు


వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని పశ్చిమగోదావరి జిల్లాలోని తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులు హైదరాబాదులో కలిశారు. సత్యవతి ఆధ్వర్యంలో వీరంతా జగన్ వద్దకు వచ్చారు. తమ పోరాటానికి మద్దతు తెలిపినందుకు ఈ సందర్భంగా జగన్ కు కృతఙ్ఞతలు తెలిపారు. ఆక్వా ఫుడ్ బాధితులకు మద్దతుగా తుందుర్రు గ్రామంలో జగన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, బాధితులకు పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తామని చెప్పారు. ప్రజల కోరిక మేరకు నడుచుకోవాలని... వారి అభీష్టానికి విరుద్ధంగా ఫుడ్ పార్క్ నిర్మాణం చేపట్టవద్దని ఆ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News