: పెద్ద నోట్ల రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్.. రేపు విచారణ


ఇండియాలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలుగు రాష్ట్రాల హైకోర్టులో అడ్వొకేట్ పీవీ కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం నిర్ణయం వల్ల దేశంలో ఆర్థిక అనిశ్చితి పెరిగిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తగినంత చిల్లర నోట్లను మార్కెట్లో అందుబాటులో ఉంచకుండానే నోట్ల రద్దును తెరపైకి తెచ్చారని ఆయన తన పిటిషన్ లో ఆరోపించారు. ఆర్బీఐ నిబంధనలను పట్టించుకోకుండా నోట్లను రద్దు చేశారని తన పిటిషన్ లో కృష్ణయ్య కోర్టుకు తెలిపారు. కాగా, ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది.

  • Loading...

More Telugu News