: రూ. 500, 1000 నోట్ల రద్దు గురించి నెల ముందే చెప్పిన లోకేష్... ఎలా తెలుసని ఇప్పుడు ప్రశ్నిస్తున్న కాంగ్రెస్


రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు కానున్నాయని ముందుగానే చంద్రబాబు కుటుంబానికి తెలుసునని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. కొద్దిసేపటి క్రితం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, లోకేష్ నెల రోజుల క్రితమే 500, 1000 రూపాయల నోట్లు రద్దు కానున్నాయని వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ సంగతి అతనికెలా తెలుసునని ప్రశ్నించారు. కేంద్రంతో ఉన్న సన్నిహితంతో, విషయాన్ని ముందే తెలుసుకుని తమ వద్ద ఉన్న కరెన్సీని లోకేష్ బృందం బ్యాంకుల్లోకి చేర్చుకుందని ఆరోపించారు. చంద్రబాబు మనవడి ఖాతాలోకి రూ. 11 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా అంశం ముగిసినదేమీ కాదని, దాని కోసం తమ పార్టీ పోరాటం సాగిస్తూనే ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News