: సోషల్ మీడియా వైరల్... ఇలా జరుగుతుందని ముందే తెలిస్తే, నోట్ల రద్దును మోదీ వాయిదా వేసేవారే!


అమెరికాలో ఎన్నికల ఫలితాలు ఇలా ఉంటాయని ముందే తెలిస్తే, నరేంద్ర మోదీ నోట్ల రద్దును కొన్ని రోజులు వాయిదా వేసి వుండేవారని సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ పోస్టులో ప్రచారమవుతున్న విషయం ఏంటంటే, నరేంద్ర మోదీకి, తనలా ఆలోచించే ట్రంప్ అంటేనే ఇష్టమట. సరిహద్దుల విషయాల్లో మోదీ, ట్రంప్ ల వైఖరి కూడా దాదాపు ఒకటేనట. ఇక్కడ 'అబ్ కీ బార్ మోదీ సర్కార్' అని 2014లో మోదీ నినదిస్తే, అమెరికాలో 'అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్' అని ట్రంప్ నినదించారు కూడా. ఇక అన్ని సర్వేల నుంచి మాక్ పోల్స్ వరకూ డెమోక్రాట్ల అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తుందని వెల్లడించిన వేళ, ఆ వార్తకు ఇండియాలో అంత ప్రాధాన్యత రాకుండా చూడాలన్న ఆలోచనతోనే మోదీ, మంగళవారం నాడు పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేశారన్నది ఈ ప్రచార సారాంశం. అదే ట్రంప్ గెలుస్తాడన్న ఆలోచన ఉండుంటే, నోట్ల రద్దు ప్రకటన కొన్ని రోజులు ఆలస్యమై ఉండేదట. ఈ ప్రచారం కల్పితమే అయినప్పటికీ, నేటి దినపత్రికల్లో టాప్ బ్యానర్ గా ఉండాల్సిన యూఎస్ ఎలక్షన్ వార్తలు కిందకు పడిపోయిన మాట మాత్రం వాస్తవం. ఇక నేడు సైతం టీవీ చానల్స్ మొత్తం అమెరికా ఎన్నికల వార్తలకు ఎంత ప్రచారం ఇస్తున్నాయో, అంతకు మించిన సమయాన్ని నోట్ల రద్దు, దాంతో ప్రజలు పడుతున్న అవస్థలు వంటి కథనాలకు కేటాయిస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News